Header Banner

మగాళ్లను మర్డర్ చేసుకుంటాం.. ఒక్కచాన్స్ ..!. ఉమెన్స్‌డే వేళ రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ..

  Sat Mar 08, 2025 21:19        India

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్ నాథ్ రావు ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ విభిన్నమైన అభ్యర్థన చేశారు. మహిళలపై పెరుగుతున్న నేరాలను అణచివేసేందుకు, తగిన శిక్షలు లేకుండా మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఒక హత్యకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాసిన ఆమె, దేశంలో మహిళల భద్రత క్షీణిస్తున్న పరిస్థితిని వివరించారు. బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి శాంతిని కోరిన మహానుభావులు నడయాడిన దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

తాజాగా ముంబయిలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఓ సర్వే ప్రకారం, భారతదేశం ఆసియాలోనే మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా పేర్కొనబడిందని ఆమె గుర్తుచేశారు. మహిళల కిడ్నాప్‌లు, అదృశ్యాలు, గృహ హింస వంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. గతంలో మహారాణి తారా రాణి, అహల్యా దేవి హోల్కర్ వంటి వీరనారులు దేశ రక్షణ కోసం కత్తి ఎత్తిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సమాజాన్ని రక్షించుకునేందుకు మహిళలకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరారు.

 

ఈ నేపథ్యంలో, మహిళల రక్షణ కోసం వారు తీసుకునే ఆత్మరక్షణ చర్యలకు శిక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని రోహిణి ఖడ్సే విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రత కోసం తీసుకునే ఏకైక తప్పిదాన్ని క్షమించాలని, ఇది సమాజంలోని దుర్మార్గపు ఆలోచనలను అణచివేసేందుకు అవసరమని తన లేఖలో వివరించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #WomenSafety #SelfDefenseRights #JusticeForWomen #StopViolenceAgainstWomen #EmpowerWomen